ఎరవ్రుల్లెలు
Erra Mallelu
అన్యాయం అక్రమాలు దోపిడీలు దురంతాలు ఎన్నాళ్లని ఎన్నేళ్లని నిలదీసినదీ రోజు అణగారిన శ్రమశక్తిని ఆవేశం ఊపిరిగా కదిలించినదీ రోజు రగిలించినదీ రోజు మేడే నేడే మేడే నేడే (2) చరణం : 1 సమభావం మానవాళి గుండెలలో నిండగా సకలదేశ కార్మికులకు ఈనాడే పండ గ లోకానికి శ్రమ విలువను చాటిన రోజు ఇది చీకటిలో చిరుదివ్వెలు వెలిగిన రోజు మేడే నేడే మేడే నేడే (2) చరణం : 2 వేదనలూ రోదనలూ వేదనలూ రోదనలూ అంతరింపజెయ్యాలని బాధల కేదారంలో శోధన మొలకెత్తింది చిరకాలపు దోపిడిపై తిరుగుబాటు జరిగినపుడు చిందిన వెచ్చని నెత్తురు కేతనమై నిలిచింది మేడే నేడే మేడే నేడే (2) చరణం : 3 భావనలో నవచేతన పదునెక్కిన ఆలోచన రేపటి ఉదయం కోసం రెప్పలు విప్పాయి బిగిసిన ఈ పిడికిళ్లూ ఎగిసిన ఆ కొడవళ్లూ శ్రామికజన సారథిగా క్రమించమని అడిగాయి మేడే నేడే మేడే నేడే (2) చరణం : 4 ఎన్నెన్నో దారులలో చీలిన మన ఉద్యమాల ఎన్నెన్నో తీరులలో చెమటోడ్చే శ్రమజీవులు ఐక్యంగా నిలవాలి కదనానికి కదలాలి సామ్యవాద సాధనకై సమరం సాగించాలి మేడే నేడే మేడే నేడే (3) చిత్రం : ఎరవ్రుల్లెలు (1981) రచన : అదృష్ట దీపక్ సంగీతం : చక్రవర్తి గానం : ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం, బృందం |
Erra Mallelu